OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు సుజిత్. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్ ను తీసుకున్నారు. ఆ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏంటి నిజమా.. అని అనుకోని చెక్ చేస్తే.. పప్పులో కాలు వేసినట్టే.
Bro Trailer: బ్రో ట్రైలర్.. మామఅల్లుళ్లు అదరగొట్టేశారు
అవును ఆ పోస్టర్ ఫ్యాన్ మేడ్. అది జరిగితే బావుండు అనే ఊహతో అభిమానులు చేసిన జిమిక్కు ఇది. నిజం చెప్పాలంటే.. ఆ పోస్టర్ చూసి సడెన్ గా అమితాబ్ బచ్చన్ నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నాడా అనే అనుమానం రాక మానదు. ఆ రేంజ్ లో ఉంది పోస్టర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల ఎడిటింగ్స్ చూస్తే .. ఫేక్ ఏది.. ? ఒరిజినల్ ఏది అని కనుక్కోవడానికే సగం టైమ్ పట్టేలా ఉంది. ఈ పోస్టర్ ను సడెన్ గా చూసిన అభిమానులు.. ఓరీ మీ దుంపలు తెగ .. ఒక్క సెకన్ గుండె ఆగిపోయింది కదరా అంటూ చెప్పుకొస్తున్నారు. ఎడిట్ పిక్ కే అభిమానులు ఈ రేంజ్ లో షాక్ అయితే ఒకవేళ నిజంగా నిజమైతే.. హైప్ తో చచ్చిపోతారేమో అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.