Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేవర సినిమాతో పరిచయం అవుతున్న ఈ భామ తాజాగా బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు. దంగల్, చిచ్చోరే సినిమాలతో సౌత్ ఆడియెన్స్ కు దగ్గరైన నితేష్ తివారి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న బవాల్ మిక్స్డ్ టాక్ తో ముందుకు వెళ్తోంది. అయితే ఈ సినిమాలో జాన్వీ చెప్పిన కొన్ని డైలాగ్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ చిత్రంలో జాన్వీ.. వివాహాన్ని.. వార్ 2 తో కంపేర్ చేసి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం..
” ప్రతి బంధంలో కూడా ప్రతిఒక్కరు వరల్డ్ వార్ 2 తర్వాత బందీలుగా మారినట్టు మారతారు” అంటూ చెప్పుకొచ్చింది .. వివాహం అనేది ఒక బందీఖానా అన్నట్టు చెప్పుకురావడంతో ఆమెపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో జాన్వీ ఇరుక్కుపోయింది. జాన్వీని సైతం వారు తప్పుపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలాంటివేమీ జాన్వీ పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ దేవర షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాపైనే అమ్మడు అన్ని ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ లో కనుక మంచి హిట్ పడితే.. అమ్మడి రేంజ్ ఓ రేంజ్ కు వెళ్ళిపోతుంది. అందుకే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ మీద చాలా ఆసక్తి చూపిస్తోంది. మరి ఈ సినిమాతో జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.