Jabardasth Varsha: జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్స్ వర్ష ఒకరు. సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసుకొనే ఆమె .. జబర్దస్త్ కు వచ్చి.. ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణం నడిపి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంకోపక్క నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఇక ఈ గుర్తింపుతోనే అమ్మడు బిగ్ బాస్ ఆఫర్ ను అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్నీ వర్ష సైతం అంగీకరించడం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష తన జీవితంలో జరిగిన చేదు సంఘటనలతో పాటు ఒక రియాలిటీ షోలో పాల్గొననున్నట్లు తెలిపింది. జబర్దస్త్ ద్వారా తనకు మంచి పేరు వచ్చిందని, ఎన్నో సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పిన వర్ష.. అక్కా, చెల్లి, వదిన పాత్రల్లో చేయడం తనకు ఇష్టమే అని తెలిపింది. ఈ మధ్యనే ఒక రియాలిటీ షోకు రమ్మని ఆఫర్ వచ్చింది.. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. త్వరలోనే అక్కడ కనిపిస్తాను అని చెప్పుకు రావడంతో బిగ్ బాస్ లోకి వర్ష కన్ఫర్మ్ అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Vrushabha: మోహన్ లాల్ తో శ్రీకాంత్ కొడుకు మలయాళ ఎంట్రీ.. షూటింగ్ షురూ
ఇక రెండు ఏళ్ళ క్రితం తాను ఒక బాధాకరమైన సంఘటన నుంచు బయటపడినట్లు చెప్పుకొచ్చింది. ” చిన్నతనం నుంచి తండ్రి ప్రేమకు నోచుకోని నాకు అన్ని అన్నయ్యే దగ్గర ఉండి చూసుకున్నాడు. ఇక రెండేళ్ల క్రితం అన్నయ్యకు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. చిన్న దెబ్బనే అనుకున్నాం.. కానీ తలకు గట్టిగా తగిలి.. మెదడులో రక్తం గడ్డకట్టింది అని డాక్టర్స్ చెప్పారు. నాకు ఏం చేయాలో తోచలేదు. డాక్టర్ కాళ్ళు పట్టుకొని మా అన్నయ్యను బతికించమని వేడుకున్నాను. ఎంత ఖర్చయినా సరే బతికించండి అని బతిమాలాను. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్తే తట్టుకోలేరని.. నేనే హాస్పిటల్ లో ఉన్నాను. అన్నయ్య బెడ్ పక్కనే వాష్ రూమ్ ముందు రెండు రోజులు పడుకున్నాను. భయం వేసింది. అన్నయ్య లేకపోతే నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. అలానే ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. అదే హాస్పిటల్ లో నన్ను అడ్మిట్ చేసి చికిత్స చేశారు. లేచి అన్నయ్య.. అన్నయ్య అంటూ అరిచాను. అన్నయ్యకు పర్వాలేదు అని తెలిసాకే నేను కోలుకున్నాను. ఎందుకంటే అన్నయే నా పంచ ప్రాణాలు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వర్ష వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.