Vedhika: ముని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ వేదిక. ఈ సినిమా తరువాత విజయదశమి, బాణం సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇందులో బాణం సినిమా అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది కానీ, వేదికకు మాత్రం అవకాశాలు రాలేదు. అడపాదడపా తెలుగులో కనిపించిన ఆమె .. కోలీవుడ్, మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో వేదిక ఒక్క తెలుగు సినిమాలో కనిపించింది లేదు. అయితేనేం అమ్మడి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బికినికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది.
Baby Movie: బేబీ మూవీకి కొత్త క్లైమాక్స్.. ఎలా ఉండేదో.. ?
ఇక తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కించింది. లోపల బికినీ వేసుకొని పైన బ్లాక్ కలర్ ట్రాన్స్ప రెంట్ కోట్ వేసుకొనిషాక్ ఇచ్చింది. అయితే వేదికకు ఇదేమి కొత్త కాదు. బికినీలో అమ్మడు నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక అప్పటికి, ఇప్పటికి ఆమె అందం మాత్రం తగ్గలేదు. పర్ఫెక్ట్ బాడీ, అందం, అభినయం ఉన్నా కూడా వేదికకు మాత్రం సరైన అవకాశాలు మాత్రం అందుకోలేదు. ఇంత చూపిస్తున్నా.. ఆమెకు అవకాశాలు ఎందుకు రావడం లేదు అనేది ఆమె అభిమానుల ప్రశ్న. మరి ఈ అందాన్ని మెచ్చి.. ముందు ముందు ఏ డైరెక్టర్ వేదికకు సినిమా ఛాన్స్ ఇస్తాడో చూడాలి.