దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది ‘లూజర్’ వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన టైమ్ లో అంటే… 2020 మే 15న ‘లూజర్’ ఫస్ట్ సీజన్ కు సంబంధించిన మొత్తం పది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే వెబ్ సీరిస్ సీజన్ 2కు సంబంధించిన ఎనిమిది ఎపిసోడ్స్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్…
సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ…
తెలుగు చిత్రసీమలో పలు చెరిగిపోని తరిగిపోని రికార్డులు నెలకొల్పిన ఘనత అన్న నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తొలిసారి నేరుగా ద్విశతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా పాతాళభైరవి (1951) నిలచింది. తరువాత తొలి తెలుగు స్వర్ణోత్సవ చిత్రంగానూ పాతాళభైరవి నిలచింది. ఆ పై మొట్టమొదటి వజ్రోత్సవ చిత్రం (60 వారాలు)గా లవకుశ (1963) నిలచింది. ఆ పై నేరుగా మూడు వంద రోజులు ఆడిన సినిమాగా అడవిరాముడు (1977) వెలిగింది. సాంఘికాలలోనూ వజ్రోత్సవ చిత్రంగా వేటగాడు (1979)…
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. ప్యాండమిక్లోనూ విజయవంతంగా అర్ధశతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగానూ అఖండ నిలచింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ పలు అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత బాలకృష్ణ నటవిశ్వరూపం గురించి చర్చోపచర్చలు మొదలయ్యాయి. మొన్నటి దాకా బాలయ్య అంటే ముక్కోపి, అభిమానులను సైతం కొడుతూ ఉంటాడు అన్న మాటలు పక్కకు పోయాయి. అఖండ చిత్రాన్ని ఒంటిచేత్తో ఆయన విజయపథంవైపు…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యా సాగర్ చింత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ వీసీ డిజిటల్ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక తాజగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్…
‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న…
సంక్రాంతికి విడుదలైన ‘రౌడీ బాయ్స్’ డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. దీనికి కారణం అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ బ్యూటీ ఈ సిమాలో లిప్ లాక్స్ తో చెలరేగింది. ప్రస్తుతం ఈ లిప్-లాక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఇంతలా రెచ్చిపోని ఈ బ్యూటీ ఇప్పుడు హద్దులు దాటి కొత్త హీరోతో రొమాంటిక్ సీక్వెన్స్‌లో రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అయితే దీనికోసం అనుపమ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కొత్తహీరోతో జతకట్టడంతో పాటు…
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్…
ప్రస్తుతం హీరోయిన్లు.. గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమవ్వాలని కోరుకోవడంలేదు. హీరో పాత్రకు తీసిపోకుండా .. ఛాలెంజింగ్ రోల్స్ నే ఇష్టపడుతున్నారు. అందుకోసం ఎంతటి కష్టమైన భరిస్తున్నారు. ఇక వీటికోసం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు. లేడి ఓరియెంటెడ్ మూవీ.. అందులోను హీరోయిన్ గర్భిణీ పాత్ర అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పాత్రలను ఒకప్పుడు రమ్య కృష్ణ, శ్రీదేవి లాంటి వారు…
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అతడు, ఖలేజా సినిమాల తరువాత త్రివిక్రమ్- మహేష్ కాంబోపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో మహేష్ చెల్లి పాత్రలో యంగ్ హీరోయిన్…