న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ, ”ఇదో నేచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరీ. ఈ సినిమా ఫ్లేవర్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్…
ఓ కొత్త హీరో జనం ముందు నిలవాలంటే, ఖచ్చితంగా అంతకు ముందు కొంతయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి. ఇక సినిమా రంగంతోనే అనుబంధం ఉన్న వారి కుటుంబాల నుండి వచ్చే హీరోలకు వారి పెద్దల నేపథ్యమే పెద్ద అండ. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సమీపబంధువు, భాగస్వామి శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్తో హీరోగా జనం ముందుకు వచ్చాడు. సంక్రాంతి సంబరాల్లోనే రౌడీ బాయ్స్ రావడం వల్ల కొత్త హీరోలకు సైతం…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో చిత్రంతో గల్లా అశోక్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పడంతో సినిమాపై…
ఆరేళ్ళ క్రితం ఇదే సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంటూ వచ్చి వినోదం పంచేసి, ఎంచక్కా హిట్టు పట్టేశాడు బంగార్రాజు. ఇప్పుడు ‘బంగార్రాజు’గానే జనం ముందు నిలచి మళ్ళీ సంక్రాంతికే సందడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ సారి తానొక్కడే కాదు, తనయుడు నాగచైతన్యనూ కలుపుకొని సంక్రాంతి సంబరాల్లో సందడి మరింత పెంచడానికి సిద్ధమయ్యాడు నాగార్జున. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ‘బంగార్రాజు’ను తెరపై నిలిపారు. అప్పుడంటే బంగార్రాజు ఆత్మ వచ్చి, తనయుడిలో ప్రవేశించి, తెగ…
మాస్ మాహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా పూజ కార్యక్రమాలను నేడు ఘనంగా జరుపుకొంటుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తాజగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్ కొత్త పోస్టర్ తో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇకపోతే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల వలన చరణ్ షూటింగ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం…
నవతరం వేగానికి తాము తట్టుకోలేమని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. నిజమే! ప్రస్తుతం అన్నిటా వేగం పెరిగిపోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రియదర్శని’ని చేతిలో పట్టుకు తిరుగుతున్న రోజులివి. సాంకేతికత పేరుతో ఏళ్ళ తరబడి చలనచిత్రాలను రూపొందిస్తున్న రోజులు కూడా ఇవే! ఓ భారీ జానపదం తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు. నవీన సాంకేతికతతో వేగం పెరిగిన రోజుల్లోనే ఇన్ని రోజులు అయితే, నలభై ఐదేళ్ళ క్రితం ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని రూపొందించడానికి…
ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.…
హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా…
హీరోగా తరుణ్ కెరీర్ లో తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తోనే మరపురాని విజయాన్ని అందుకున్నారు. ఆ బ్లాక్ బస్టర్ తరువాత ‘ప్రియమైన నీకు’ వంటి హిట్ తరుణ్ దరి చేరింది. అటు పై తరుణ్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ గా ‘నువ్వు లేక నేను లేను’ నిలచింది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రం ద్వారా వై. కాశీ విశ్వనాథ్ దర్శకునిగా పరిచయమయ్యారు. 2002 సంక్రాంతి సంబరాల్లో జనం మదిని…