అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లో నాగ చైతన్య, హీరోయిన్ దక్ష నగార్కర్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతుండగా చై వెనక్కి తిరిగినప్పుడు దక్ష కనుబొమ్మలు ఎగురవేయడం, అందుకు చై సిగ్గు పడడం.. ఈ క్యూట్ వీడియో అప్పట్లో…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మొదటి పోస్టర్ తోనే ఆసక్తిరేపిన ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ సంక్రాంతి పండగ సందర్భంగా రివీల్ చేశారు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు ఇంట్రడక్షన్ చూపించారు. రాజు…
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రంతో సుమ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఇటీవల అమెజాన్ లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు వీక్షించి ప్రశంసలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్…
అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ఓటిటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది.…
అభినవ్ సర్దార్, చాందనీ, రామ్ కార్తీక్, షెర్రీ అగర్వాల్ లీడ్ రోల్స్ గా నటించిన చిత్రం ‘రామ్- అసుర్’. వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో అమెజాన్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కృత్రిమ వజ్రం తయారీపై తెరెకెక్కిన ఈ చిత్రంలో పీరియాడిక్ లవ్ స్టోరీతో పాటూ, కాంటెంపరరీ ప్రేమకథ…
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు అక్క పురందేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన భోగీ మంటల నుంచి బాలయ్య చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. కారంచేడులో పురంధేశ్వరి ఇల్లంతా బాలయ్య అభిమానులతో నిండిపోయింది. ఇక నేడు సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ గుర్రపు స్వారీ చేశారు. అంతేకాకుండా గుర్రంతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వేడుకల్లో అందరి చూపు నట వరుసుడిపైనే…
మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించడం కొత్తేమి కాదు.. ‘కెజిఎఫ్’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘జై లవకుశ’ చిత్రాల్లో అమ్మడి ఐటెం సాంగ్స్ ఓ రేంజ్ లో దుమ్మురేపాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఐటెం సాంగ్ తో పిచ్చిలేపింది. మెగాహీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.…
తెలుగునాట పురుడు పోసుకున్న ఓ కథ, హిందీలో తిరిగి వస్తే, మళ్ళీ దానిని పట్టుకొని సినిమాలు తీసిన వారున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘భార్యాబిడ్డలు’. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1953లో నటించిన ‘బ్రతుకు తెరువు’ ఆధారంగానే ‘భార్యాబిడ్డలు’ రూపొందింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తాతినేని రామారావు దర్శకత్వంలో ఏ.వి.సుబ్బారావు నిర్మించిన ‘భార్యాబిడ్డలు’ 1972 జనవరి 15న విడుదలయింది. ‘భార్యాబిడ్డలు’ కథ విషయానికి వస్తే – మోహన్ కు పెళ్ళయి భార్యాబిడ్డలు ఉంటారు. వారితో పాటు చిన్నతమ్ముళ్ళు,…
యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ చిత్రం డిసెంబర్ రెండో వారంతో థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ బరిలో సరిగా టార్గెట్ రీచ్ కాలేకపోయిన ఈ సినిమా ఆహాలో మాత్రం వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 7వ తేదీ నుండి ‘లక్ష్య’ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే పది కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను ఈ సినిమా రీచ్ అయ్యింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ప్రతినిధులు తెలియచేస్తూ, ‘నాగశౌర్య నటించిన ఈ…