‘అన్నమయ్య’ అన్న పదం వింటే చాలు తెలుగువారి మదిలో ఆయన పలికించిన పదకవితలు చిందులు వేస్తాయి. ‘తెలుగు పదకవితాపితామహుని’గా చరిత్రలో నిలచిన ‘అన్నమాచార్య’ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని పలువురు ప్రయత్నించారు. అలాంటి వారిలో కవి, దర్శకులు ఆచార్య ఆత్రేయ, నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం, రచయిత, దర్శకుడు జంధ్యాల వంటివారు ఉన్నారు. వారి ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోయినా, కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వి.యమ్.సి. దొరస్వామి రాజు చేసిన ప్రయత్నం ‘అన్నమయ్య’ సినిమాగా రూపొంది జనాన్ని విశేషంగా…