HHMV : పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది, అలాగే పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించిన బెక్కెం జనార్దన్ ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవితంలోని సంఘటనలను చిత్రీకరిస్తామంటూ ప్రకటించి, ఇప్పుడు…
నిత్యం అనేక ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ మరికొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో, ఈ సినిమాని మొదట డైరెక్ట్ చేసిన క్రిష్ పేరును ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్‌తో, ఆథెంటిక్ స్క్రిప్ట్‌లతో సినిమాలు చేసే క్రిష్ లాంటి డైరెక్టర్‌కు సరైన గుర్తింపు రాలేదని, కానీ అనేక కాపీరైట్ ఇష్యూస్, పిఆర్ స్టంట్స్‌తో…
తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.…
టాలీవుడ్ కు సనాతన ధర్మం పట్ల చులకన, హేళన, అవమానపరిచే భావనతో పనిచేస్తుందని, దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని, ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపటలేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి టాలీవుడ్ ను ప్రశ్నించారు. మంచు మోహన్ బాబు, విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన…
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను.…
టాలీవుడ్ హీరో బెల్లం కొండా శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద హల్చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కార్ తో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అడ్డుకుని ఇదేంటని నిలదీయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటపడింది. అందరికీ ఆదర్శంగా నిలిచే నటులే ఇలా ప్రవర్తిస్తే సాధారణ ప్రజలు వీరిని చూసి ఏం నేర్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.