హాస్య మూవీస్ బ్యానర్ స్థాపించి పలు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాత రాజేష్ దండ, ఒక టాలీవుడ్ న్యూస్ పోర్టల్ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన నిర్మించిన కే రాంప్ (K-Ramp) అనే సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. మూడు రోజుల్లో రూ. 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే, ఒక న్యూస్ పోర్టల్ మాత్రం ట్విట్టర్‌లో తమ సినిమా మీద దుష్ప్రచారం చేస్తుంది అంటూ రాజేష్ దండ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
Also Read :Tharun Bhaskar : రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. ఏదో జరుగుతోందిగా..
“సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ, ఒక వెబ్‌సైట్ మాత్రం ఇంకా ఏడుస్తుంది. వాడికి చెబుతున్నా, అమెరికాలో ఉన్న వాడికి పగలగొడతా. నీకేం తెలుసురా లుచ్చా నా కొడకా? డ్యూడ్ గురించి ఏదో వేస్తున్నావ్, అది తెలుగు తమిళ్ రా కుక్క! తొక్కుతావా సినిమాని? తొక్కరా నువ్వు మగాడివైతే. ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని చూస్తున్నాడు ఈ నా కొడుకు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మా మీద బతికే నా కొడకా, ఉరితీయాలి వీళ్ళని నడిరోడ్డు మీద,” అంటూ పరుషంగా మాట్లాడారు.