Chiranjeevi :బ్రేక్ తీసుకుని వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించకుండానే వెళ్లిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, చిరంజీవి కేవలం “నేను చెప్పాల్సింది చెప్పాను” అంటూ ముందుకు కదిలారు. నిజానికి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మొన్ననే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ ద్వారానే తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని చిరంజీవి పరోక్షంగా తెలిపారు. అందుకే, తాజాగా ఈ అంశంపై మళ్ళీ మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
READ ALSO: AP Liquor Scam : ఏసీబీ కోర్టులో ఎంఫీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు
నందమూరి బాలకృష్ణ కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడారని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా లేఖ విడుదల చేశారు. ఈ విషయంపై బాలకృష్ణ స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం మీద మరోసారి స్పందిస్తారని భావించిన మీడియాకి షాక్ ఇస్తూ ఆయన చెప్పాల్సింది చెప్పానంటూ స్పందించకుండానే వెళ్ళిపోవడం గమనార్హం.
READ ALSO: IAF Tejas Delay: భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్.. పాక్, చైనాలకు వరం అవుతుందా?