What’s Today: • అమరావతి: నేడు ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఇప్పటం ప్రజలను కలవనున్న పవన్ కళ్యాణ్ • రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో నేడు ఓబీసీ మోర్చా సమ్మేళనం.. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు • నంద్యాల: నేడు ప్యాపిలి మండలం ఓబులదేవరపల్లిలో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రాంభించనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి • నేటి పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం…
What’s Today: • హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర.. పురానాపూల్, చార్మినార్, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఐమ్యాక్స్ మీదుగా సాగనున్న రాహుల్ పాదయాత్ర • రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సౌత్ జోన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు • కర్నూలు: నేడు రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్..…
Samsung India: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత అధిక ఆదాయం ఈ సంవత్సరం సమకూరింది. ఇతర ఆదాయం ఏకంగా 78 శాతం (రూ.2873.20 కోట్లకు) పెరగటంతో ఈ వృద్ధి నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.75,886 కోట్లు కాగా ఈసారి రూ.82,451 కోట్ల రెవెన్యూ వచ్చింది. అంటే.. గతేడాది కన్నా ఇప్పుడు 8.65 శాతం గ్రోత్ సాధించింది. ఇదిలాఉండగా శామ్‌సంగ్ ఇండియాకి నెట్ ప్రాఫిట్…
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది.
Business Today: హైదరాబాద్ సిగలో మరో అంతర్జాతీయ కేంద్రం: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కి మరో ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఎంఎన్‌సీ రోషె ఫార్మా తన డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాన్ని గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పిలుస్తారు. షార్ట్ కట్‌లో ‘గేట్’ అని కూడా వ్యవహరిస్తారు.
What’s Today: • ఢిల్లీ: నేడు ఉదయం 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. కేబినెట్‌తో పాటు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ • నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఏపీలో 119 కి.మీ పాటు సాగనున్న రాహుల్ పాదయాత్ర.. ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ • అమరావతి: నేడు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో…
Business Today: తెలంగాణకు 3, ఏపీకి 2 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 యూనిట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణకు 3, ఆంధ్రప్రదేశ్‌కు 2 లభించాయి. తెలంగాణలో జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖమ్మంలోని సిటీ యూనియన్ బ్యాంక్ దీనికి ఎంపికయ్యాయి.