What’s Today:
• ఢిల్లీ: నేడు ఉదయం 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. కేబినెట్‌తో పాటు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ
• నేటి నుంచి ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఏపీలో 119 కి.మీ పాటు సాగనున్న రాహుల్ పాదయాత్ర.. ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో భేటీ కానున్న రాహుల్ గాంధీ
• అమరావతి: నేడు జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్.. విశాఖ ఘటనలు సహా తాజా రాజకీయాంశాలను ప్రస్తావించనున్న పవన్
• అమరావతి: నేటి నుంచి ఆందోళన బాట పట్టనున్న ఏపీ స్టేట్ ఆడిట్ ఉద్యోగులు.. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళన బాట పట్టిన ఆడిట్ ఉద్యోగులు.. ఇవాళ ధర్నా చేపట్టనున్న స్టేట్ ఆడిట్ ఉద్యోగులు
• పల్నాడు: నేడు పెదకూరపాడు నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు
• నేడు రాజమండ్రి సిటీలో అమరావతి రైతుల మహా పాదయాత్ర.. ఏపీ పేపర్ మిల్లు నుండి ప్రారంభమై దేవీచౌక్ మీదుగా మధ్యాహ్నం రాజమండ్రి మున్సిపల్ స్టేడియం చేరుకోనున్న పాదయాత్ర.. సాయంత్రం మున్సిపల్ స్టేడియం నుండి బయలుదేరి మోరంపూడి సెంటర్‌తో ముగియనున్న పాదయాత్ర
• నేటి నుంచి మునుగోడులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం.. రోడ్ షోలలో పాల్గొననున్న బండి సంజయ్
• మునుగోడు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ