‘కింగ్ ఖాన్’, ‘కింగ్ ఆఫ్ బాలీవుడ్’, ‘బాద్ షా ఆఫ్ బాలీవుడ్’ – ఇలా జేజేలు అందుకున్న షారుఖ్ ఖాన్ తో గత కొన్నేళ్ళుగా విజయం దోబూచులాడుతోంది. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు కళ్ళు ఇంతలు చేసుకొని కాచుకొని ఉండేవారు. షారుఖ్ సినిమా రిలీజయిన మొదటి రోజు మొదటి ఆట చూడకుంటే మనసు కుదుటపడని వారు అప్పట్లో ఎందరో ఉండేవారు. షారుఖ్ నటించిన ‘రొమాంటిక్ మూవీస్’ అనేకం బాక్సాఫీస్ బరిలో నిలచి, జనం…