తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టడం ఆందోళనకు దారి తీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశాయి.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం పంచాయతీలో అర్ధరాత్రుల్లో మహిళ వింత అరుపులు కొందరి యువకులను భయాందోళనకు గురిచేశాయి. ఎల్.వి.పురం గ్రామం కట్లకణం దగ్గర బైక్పై వెళుతున్న యువకులకు చీకట్లో మహిళ కంటపడడంతో యువకులు భయంతో పరుగులు పెట్టారు.