YV Subba Reddy: సిట్ అడిగిన ప్రశ్నలకు అన్నీ నిజాలే చెప్పా.. వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..
- కల్తీ నెయ్యితో అవినీతికి పాల్పడ్డాను అని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు..
- అలాంటి నీచమైన పని నేను చేయలేదన్న వైవీ సుబ్బారెడ్డి..
- బాధ్యత గల పదవిలో ఉండి భక్తుల మనోభావాలతో నేను ఆడుకోలేదు..
- సిట్ అధికారులు ఎప్పుడు వచ్చినా విచారణకు సహకరిస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YV Subba Reddy: టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నివాసం నుండి వెనుదిరిగారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌ను సుబ్బారెడ్డికి చదివి వినిపించినట్లు సమాచారం. విచారణలో భాగంగా, సిట్ అధికారులు సుబ్బారెడ్డి నివాసంలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, వాటిని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరం అయితే తిరిగి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి సిట్ స్పష్టంగా తెలిపింది.
Read Also: Akhanda2 : అఖండ 2.. థియేట్రికల్ రైట్స్.. బాలయ్య కెరీర్ బెస్ట్
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
ఇక, సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా. కల్తీ నెయ్యి విషయంలో వాస్తవాలు బయటపడాలనే ఉద్దేశంతోనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాను… 2024 జూన్‌లో నలుగు నెయ్యి ట్యాంకులు సరఫరా అయ్యాయని చెబుతున్నారు.. అందులో జంతువుల కొవ్వు ఉందా? లేక ఇతర ఆయిల్స్ కలపబడ్డాయా? అన్నది తేల్చమని కోర్టు ఆదేశించింది.. కల్తీ నెయ్యితో నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేయడం దారుణం. అలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు అని స్పష్టం చేశారు..
Read Also: IBoMMA Ravi Case: ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామం.. మరో మూడు సెక్షన్‌లు జోడింపు..
కల్తీ నెయ్యి కాకుండా కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.. అవినీతి చేయాలంటే అవి చేస్తాను, నెయ్యి ఎందుకు?” అని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు, అప్పన్న నా పీఏ కాదని తెలిపారు.. 2018 నుంచే నాకు పీఏ కాదని వెల్లడించారు.. అతని ఖాతాలో నెయ్యి సరఫరాదారుల నుంచి లావాదేవీలు జరిగి ఉంటే అతనిపై విచారణ జరపాలి. అతనికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.. 2014 నుండి నెయ్యి సరఫరాలపై కూడా విచారణ జరపాలని సిట్‌ను కోరా.. భక్తుల విశ్వాసంతో నేను ఎప్పుడూ ఆడుకోలేదు. బాధ్యతగల పదవిలో ఉండి పని చేశానని వెల్లడించారు.. ఇక, ఎప్పుడైనా విచారణకు రావాల్సి వస్తే పూర్తిగా సిట్‌కు సహకరిస్తాను అని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి..
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!