Bhumana Karunakar Reddy: తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసినట్లు ఒక్క మాట సీబీఐ సిట్ లో రిమాండ్ లో చెప్పలేదు.. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టులో చెప్పకోచ్చారు.
YS Jagan: సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబులో ఏ మార్పు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు సుప్రీంకోర్టులో పలు కీలక కేసుల విచారణ జరగనుంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో అనేక కేసులు విచారణకు రానున్నాయి, ఇందులో తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించే లడ్డూలలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే కేసుపై నేడు అందరి దృష్టి ఉంటుంది. ఇది కాకుండా కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
TG Venkatesh: ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేస్తే నిన్ను నమ్మరు జగన్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను ఎందుకు పోగొట్టుకోవడం లేదని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నాడు.
Pawan Kalyan: ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదలు పెట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రం కావడంతో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేపట్టి దీక్షను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
తిరుపతి లడ్డూ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మతపరమైన ప్రదేశాల పవిత్రతను పరిరక్షించేలా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తిరుమలలో లడ్డూల కల్తీపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ సీనియర్ నేత రాసుకొచ్చారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తనను ఆందోళన కలిగిస్తుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పూజించే…