Tirupati Laddu Controversy: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్.. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది.. ఈ రోజు శ్రీవారి ఆలయంలోని పోటులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది.. ఆలయంలోని బూందీ పోటుని తనిఖీ చేసింది సిట్ బృందం.. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై పోటు కార్మికుల వద్ద వివరాలు సేకరించారు సిట్ అధికారులు.. అంతేకాకుండా పోటు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.. అయితే, దర్యాప్తుని గోప్యంగా నిర్వహిస్తున్నారు సిట్ అధికారుల బృందం..
Read Also: Kadiyam Srihari: తప్పు చేశాడు కనుకే భయపడుతున్నాడు.. కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పిండిమరతో పాటు ల్యాబ్‌లో సిట్ టీమ్ తనిఖీలు చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే ముడి సరుకులను నిల్వ చేసే గోదాములను పరిశీలించింది. గోడౌన్‌లలో నిల్వఉంచిన ముడిసరుకుల నాణ్యతను సిట్ చెక్ చేసింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును ఎలా భద్రపరుస్తారు.. వాటికి సంబంధించిన రికార్డులను ఎలా మెయిన్‌టేన్ చేస్తారు.. అనే అంశాలపై సిట్ గతంలోనే ఆరా తీసింది. అలాగే.. లడ్డూ ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యి శాంపిల్స్‌ను ఎలా టెస్ట్ చేస్తారనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక, ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు నెయ్యి నిల్వ చేస్తారు.. ప్రసాదాల తయారీకి ఎలా తరలిస్తారు.. లడ్డూ తయారీ ఎలా ఉంటుంది.. తయారైన లడ్డూలను ఎలా కౌంటర్లకు తరలిస్తారనే అంశాలపై కూడా గతంలోనే పరిశీలించింది సిట్ బృందం..