తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
V. Hanumantha Rao: భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్షకు కూర్చున్నానని తెలిపారు.
తిరుమల శ్రీవారికి మహా భక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంతలా అంటే... సాధారణ భక్తులు ఎవ్వరికీ వీలవని విధంగా వారానికోసారి, కుదిరితే రెండు సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. మరి అంతటి భక్తి ఉన్న నాయకురాలు శ్రీవారి మహా ప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా.. ఎందుకు మాట్లాడటం లేదు? అసలా విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమా భక్తిరస కథాచిత్రమ్?