Laddu Controversy: అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం.. ఆ ప్రసాదాలపై నిషేధం..!
- అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం..
- బాల రాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నిషేధం..
- పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీ వివాదంతో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని నిర్ణయించారు. అలాగే, భక్తులకు కూడా ప్రసాదంగా అందిస్తామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
Read Also: Devara: దేవర రిజల్ట్.. కొరటాల శివ థాంక్స్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇక, దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అనుమానించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు, మఠాల్లో బయట సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను పూర్తిగా నిషేధించాలని కోరారు. దేవుళ్లకు ప్రసాదం ఆలయ అర్చకుల పర్యవేక్షణలోనే తయారు చేసి సమర్పించాలని సూచించారు.
Read Also: Maharastra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కార్యాలయంపై దాడి.. పారిపోయిన నిందితురాలు
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతుందని అయోధ్య రామ మందిర ప్రధాన పూజరి చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసన్యాసులు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అదే విధంగా మార్కెట్లో అమ్ముతున్న నూనె, నెయ్యిల నాణ్యత ప్రమాణాలను కూడా తనిఖీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రామ మందిర పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!