కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 79,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆదివారం 21,504 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు హుండీల లెక్కింపు మరింత సులభతరం కానుంది.
భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి హుండీలో రోజుకే కోట్లాది రూపాయలు కానుకగా వచ్చిపడుతుంటాయి. రోజూ కనీసం 4 నుంచి 5 కోట్ల రూపాయల కానుకలు వస్తాయి. వాటిలో వచ్చే నగదుని లెక్కించడం అంత ఆషామాషీ కాదు. ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు.
Read Also: Taraka Ratna Last Rites Live: తారకరత్నకు కన్నీటి వీడ్కోలు
వీరిని పరకామణి సేవకులుగా పిలుస్తారు. శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలను అక్కడి నుంచి ఆలయానికి సమీపంలోని నూతన పరకామణి భవనంలోకి మార్చిన సంగతి తెలిసిందే. వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం ముందు రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనం పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో హుండీ లెక్కింపులను ప్రారంభించారు. ప్రత్యేకమైన ట్రాలీలు, లారీల్లో హుండీలను అక్కడికి తరలించారు. నెల రోజుల పాటు నూతన పరకామణి భవనంలో లెక్కింపులను నిర్వహించి లోటుపాట్లు ఏమున్నాయో పరిశీలించి వాటిని సరిదిద్దుతారు.
Read Also: Ghost Video: నడిరోడ్డుపై దెయ్యం.. చితకబాదిన బైకర్.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్