TTD: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. గంటన్నరలో ఏప్రిల్ కోటా మొత్తం బుకింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కొలిచినవారి కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. సీజన్‌తో సంబంధం లేకుండా తిరుమల గిరులు నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూనే ఉంటాయి.. ఇక, ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చిందంటే.. సెలవులు వచ్చాయంటే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. అయితే, ఆన్‌లైన్‌లోనూ శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఏప్రిల్ మాసానికి సంబంధించిన 3.26 లక్షల టికెట్లను అమ్మకానికి ఆన్లైన్లో పెట్టారు టీటీడీ అధికారులు.. అయితే, కేవలం గంటన్నర వ్యవధిలోనే ఏప్రిల్ కోటా మొత్తం టికెట్లను బుక్‌చేసుకున్నారు భక్తులు. కాగా, వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్ ఉండే అవకాశం ఉందని ముందే అంచనా వేశారు అధికారులు.. దానికి తగ్గట్టుగానే కేవలం గంటన్నర వ్యవధిలో 3.26 లక్షల టికెట్లను బుక్ చేసుకున్నారు భక్తులు. అయితే, గతంలో 45 నిమిషాల లోపు కూడా మొత్తం కోటా టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.
Read Also: RK Roja: ఆ నలుగురు ఎమ్మెల్యేలకు రోజా సవాల్.. దమ్మంటే రాజీనామా చేయండి..!
Also Read
- Tirumala: శ్రీవారికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు ఇవే..
- YS Jagan: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై రాజకీయ రగడ.. వాస్తవాలు వెల్లడించిన జగన్..
- Vasantha Haimavathi Passes Away: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫ్యామిలీలో విషాదం..
- Road Accident : రెండు కార్లు ఢీ.. గాల్లోకి ఎగిరిన బైకర్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.!
తాజావార్తలు
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!