TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. రూ.3500 కోట్లతో వార్షిక బడ్జెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Board Meeting: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఈ రోజు సమావేశం కాబోతోంది.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు.. వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. 398 అంశాల అజెండాపై నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి.. ఇక, రూ.3,500 కోట్ల అంచనాతో 2023-24 వార్షిక బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నారు.. ఇక, అలిపిరి వద్ద స్పిర్య్టూవల్ సిటీ నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించనుంది టీటీడీ.. లడ్డూ పోటు యాంత్రికరణ అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడులోని ఉల్లందురుపేట, యానంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి. లడ్డూ కౌంటర్ల పెంపుదలపై నిర్ణయం తీసుకోబోతోంది టీటీడీ.
Read Also: Lay Foundation Stone For Steel Plant: నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ…
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
కాగా, తిరుపతి సమీపంలోని అలిపిరి – చెర్లోపల్లి మార్గంలో తలపెట్టిన స్పిరిచ్యువల్ సిటీలో దాదాపు 50 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేవిధంగా వసతిగృహ సముదాయం నిర్మించే విధంగా టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. అలాగే తమిళనాడులోని ఉలందూరు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి రూ.4 కోట్లు, యానాంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్లు నిధులను మంజూరుకు ఆమోదం తెలపనున్నారు.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదాల పంపిణీకోసం మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 8 కాటేజీల పునర్నిర్మాణం కోసం ఈ టెండర్ విధానంపై చర్చించనుంది టీటీడీ పాలకమండలి..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!