TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజే ఆ టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. దీంతో.. తిరుమల గిరులు నిత్యం భక్తుల రద్దీతో దర్శనమిస్తాయి.. దీనిని దృష్టిలో ఉంచుకుని.. భక్తులకు ఇబ్బందులు లేకుండా.. ఆన్‌లైన్‌లోనే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎప్పటికప్పుడు దర్శన టికెట్లతో పాటు వివిధ రకాల సేవా టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో పెట్టి విక్రయిస్తుంది.. ఇక, శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేసింది టీటీడీ.. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేయనున్నారు..
Read Also: MLC Kavitha : కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్లను ఈనెల 27వ తేదీన అంటే ఈ రోజు విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించి టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శన టికెట్లకు ఎప్పుడైనా ఫుల్ డిమాండ్ ఉంటుంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కోటా పూర్తి అవుతుంది.. ఇక, వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్ ఉండే అవకాశాలు ఉంది.. దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలి.. ఇక, ఆన్‌లైన్‌లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలనుకునే భక్తులు మొదట టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అనంతరం సంబంధిత వివరాలను ఎంటర్ చేయడం ద్వారా టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. ఈ రోజు శ్రీవారి సర్వదర్శానికి 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.. ఇక, నిన్న శ్రీవారిని 79,415 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,454 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు సమర్పించారు భక్తులు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!