TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. ఇవాళ అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు అందుబాటులో ఉంచనుంది టీటీడీ.. ఫిబ్రవరి 23 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లతో పాటు.. మార్చి మాసానికి సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విక్రయించనుంది టీటీడీ.. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. ప్రస్తుతం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.. ఇక, నిన్న శ్రీవారిని 57,702 మంది భక్తులు దర్శించుకోగా.. 27,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.43 కోట్ల ఆదాయం లభించింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
కాగా, అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ వద్దకు చేరుకుంటారు.. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. స్త్రీ పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణానికి అనుమతినిస్తారు. 2.45 గంటలకు తొలుత స్త్రీలను, ఆ తర్వాత పురుషులను అంగప్రదక్షిణానికి పంపుతారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన మహిళలు వెండి వాకిలి వద్దకు చేరుకున్నాక పురుషులను అనుమతిస్తారు. ఇక, అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా, స్త్రీలు చీర, లంగా వోణీ వంటివి ధరించాల్సి ఉంటుంది.