తిరుమల శ్రీవారి దర్శనం కొసం నడిచి వెళ్లే భక్తుకుల శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనుంది. తిరుమల కొండకు నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం టికెట్లు మంజూరు చేయనున్నారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి కాలిబాట మార్గంలో సుమారు 10,000 దివ్య దర్శనం టోకెన్లు,శ్రీవారి మెట్టు మార్గంలో 5,000 టోకెన్లు జారీ చేయనున్నారు.
Also Read:Man Infected By Killer Plant : మొక్కల నుంచి మానవునికి వ్యాధులు
ఏప్రిల్ 15 నుంచి జూలై 15 మధ్య భక్తుల రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనం, ఎస్ఈడీ (ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఒక్కొక్కటి రూ.300) టిక్కెట్ల జారీని తగ్గించాలని, శ్రీవాణి, పర్యాటకం, వర్చువల్ సేవా కోటాలను తగ్గించాలని TTD నిర్ణయించింది. సాధారణ యాత్రికులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే చర్యలో భాగంగా టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవి నెలల్లో దర్శనం కోసం రిఫరల్ లెటర్లను తగ్గించాలని, భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించడంలో ఆలయ నిర్వహణకు సహకరించాలని టీటీడీ చైర్మన్ వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. అన్ని కల్యాణకట్టలు 24 గంటలూ పనిచేస్తాయని, తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను నిర్వహిస్తామని టీటీడీ పేర్కొంది. యాత్రికులకు సంబంధించిన సేవలు సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు అధికారులు, అదనపు శ్రీవారి సేవా వాలంటీర్లను నియమించనున్నారు.