తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.. సుమ భర్త రాజీవ్ కూడా పలు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
అయితే సుమ, రాజీవ్ ఎప్పుడూ ఏదొక ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.. అంతే రాజీవ్ స్వామివారి మాలను కూడా దరిస్తూ ఉంటాడు.. తాజాగా వెంకటేశ్వర స్వామి మాలను ధరించాడు.. సుమ, రాజీవ్ తిరుమలలో కనిపించారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే సుమ.. తన ఇన్‌స్టాలో ఒక వీడియో స్టోరీ పెట్టింది. ఆ వీడియోలో సుమ అండ్ రాజీవ్ తిరుమల ఘాట్ రోడ్డులో కనిపిస్తున్నారు. కారు పక్కన ఆపి తిరుమల కోన అందాలను సుమ దంపతులు వికిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తాయి..
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అలాగే ఆ వీడియో రాజీవ్ వెంకటేశ్వర స్వామి మాల ధరించి కనిపిస్తున్నాడు.. వెంకన్న మాలను తియ్యడానికే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తుంది.. ఇక సుమ విషయానికొస్తే.. ప్రస్తుతం సుమ బుల్లితెరపై షోలను తగ్గించింది.. కేవలం రెండు మూడు షోలను మాత్రమే చేస్తుంది.. అలాగే సినిమా ఈవెంట్స్ ను ఎక్కువగా చేస్తూ లైఫ్ ను బిజీగా గడుపుతుంది..