అలిపిరి మెట్ల మార్గం మొదటి ప్రదేశంలో భక్తులు విశ్రాంతి తీసుకునే రెండు రాతి మండపాల్లో ఒకటి శిథిలావస్థకు చేరుకుంది అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. కుడి వైపు ఉన్న రాతి మండపం శిథిలావస్థకు చేరింది.. రిపేరు చేయడానికి కూడా వీలు లేకుండ ఉంది.. రాతి మండపం రాళ్ళు పునర్నిర్మాణం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా శిథిలావస్థకు చేరిన తిరుమలలో పార్వేట మండపం కూల్చి పునర్ నిర్మాణం చేశాం.. దీన్ని సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేశారు.. 16వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు నిర్మాణం చేశారు అని టీటీడీ ఈవో తెలిపారు. 136 లక్షల రూపాలతో పునర్ నిర్మాణం చేస్తున్నామని ధర్మారెడ్డి చెప్పారు.
Read Also: CM Jagan: ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రారంభించనున్న సీఎం జగన్
20 పిల్లర్లతో యదావిధిగా పార్వేట మండపం పునర్ నిర్మాణం చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. నడక మార్గంలో చిరుతల సంచారం తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలించాం.. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలు రాత్రి పది గంటల వరకు అనుమతిస్తున్నాము అని ఆయన తెలిపారు. నడక దారిలో అటవీ శాఖ నుంచి మధ్యాహ్నం 2 గంటలు తర్వాత చిన్నపిల్లలను అనుమతించాలి అనే ఆదేశాలు రాలేదు.. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు అని ధర్మారెడ్డి పేర్కొన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సీసీ కెమెరాలతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ధర్మారెడ్డి అన్నారు.