ఎల్లుండి తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు.. మలయప్పస్వామి ఒకే రోజు సప్త వాహనాలుపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ ఉంటుంది. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనసేవ, ఉదయం 11 గంటలకు గరుడవాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనసేవ, మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8…
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. పదిరోజుల పాటు సాగనున్న వైకుంఠ దర్వానాల కోసం వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు, ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామి స్వర్ణరథంపై దర్శనమిస్తారని సమాచారం.…
Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భక్తులకు ప్రస్తుతం సులువైన సమయం. తిరుమలలో ప్రస్తుతం చకచకగా దర్శనాలు జరుగుతుండడంతో.. భక్తులు వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం పొందుతున్నారు. భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజున 56,560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 28,853 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సన్నిధికి 3.34…
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయని.. కానీ, శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని సూచించింది టీటీడీ.
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. ఆయన్ను పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. రమణ దీక్షితులుపై అహోబిలం మఠం, జియ్యంగార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్‌లపై నీచమైన…
Tirumala Temple Rooms: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే.. మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం ద్వారా.. భక్తుల రద్దీని కాస్త తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక…
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రింకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన ముగ్గురు మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు.