తెలుగు తేజం, భారత్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) చేయడంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తిలక్ సెంచరీతో 14 ఏళ్ల సురేశ్ రైనా రికార్డు బద్దలైంది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో…
నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-1తో…
IND vs SA: సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చితకబాదాడు. మరోవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకట్ కాగా..…
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఏ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం అల్ అమెరత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్-ఏ జట్టును భారత్ ఢీకొంటుంది.…
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో భారత్ (4 పాయింట్లు) గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ బుధవారం తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ…
T20 Emerging Asia Cup 2024 IND vs PAK: దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మైదానంలో తలపడేందుకు మరోసారి సిద్దమయ్యాయి. ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా శనివారం ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.…
Asia Cup 2024 India Schedule: అక్టోబర్ 18 నుంచి ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ప్రారంభం కానుంది. ఒమన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో 8 దేశాల ఏ జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన…
IND Playing 11 vs BAN: మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో శనివారం జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో.. బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత తుది జట్టులో భారీ మార్పులు…
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా శివమ్ దూబే వచ్చే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో ఇండియా ఎపై ఇండియా…