Tilak Varma: ముంబై ఇండియన్స్‌లో ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు!
- ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్‌ల్లో 231 పరుగులు
- 2022లో ముంబై ఇండియన్స్‌లో చేరిన తిలక్
- గతేడాది నుంచి హార్దిక్ కెప్టెన్సీలో ఆడుతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ముంబై ఇండియన్స్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ తెలిపాడు. తాను 2022లో ముంబై జట్టులో చేరా అని, అప్పటి నుంచి తాము ట్రోఫీని గెలవలేదన్నాడు. వ్యక్తిగతంగా గత మూడు సీజన్‌లు బాగానే సాగాయని, జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు మాత్రం రాలేదన్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్లేయర్లకు మద్దతుగా ఉంటాడని, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడని తిలక్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో తిలక్ వర్మ 8 మ్యాచ్‌ల్లో 231 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజాగా తిలక్ వర్మ మాట్లాడుతూ… ‘నేను 2022లో ముంబై ఇండియన్స్‌లో చేరా. అప్పటి నుంచి మా టీమ్ టైటిల్ గెలవలేదు. అందుకే నేను ఇప్పటివరకు విన్నింగ్ ఫీల్‌ను పొందలేదు. ఈ విషయాన్ని రోహిత్, సూర్యా భాయ్‌లకు ఎప్పుడూ చెబుతుంటా. వ్యక్తిగతంగా నాకు గత మూడు సీజన్‌లు బాగానే సాగాయి కానీ.. జట్టు పరంగా కోరుకున్న ఫలితాలు రాలేదు. ఈ సంవత్సరం అందరం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తాం. హార్దిక్ భాయ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. టీ20 అరంగేట్రంలో హార్దిక్ చేతుల మీదుగానే ఇండియా క్యాప్ అందుకున్నా. చాలా ప్రత్యేకమైన అనుభవం అది. గతేడాది నుంచి హార్దిక్ కెప్టెన్సీలో ఆడుతున్నా. ప్లేయర్లకు ఎప్పుడే మద్దతుగా ఉంటాడు, ఏదైనా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పేస్తాడు’ అని తెలిపాడు.
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తులం బంగారంపై ఎంత తగ్గిందంటే?
‘సూర్యకుమార్ యాదవ్ మన చుట్టూ సానుకూల వాతావరణం ఉండేలా చేస్తాడు. వికెట్ల మధ్య పరుగెత్తుతున్నప్పుడు మా మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఎంత ఒత్తిడి ఉన్నా జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అతని ముఖంలో అస్సలు ఆందోళన కనిపించదు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో 19వ ఓవర్ వేసినప్పుడు కూడా నెట్స్‌లో బౌలింగ్ చేసినట్లు నాకు అనిపించింది. బుమ్రా భాయ్ అద్భుతం’ అని తిలక్ వర్మ కొనియాడాడు. 2022లో ముంబై జట్టులో చేరిన తిలక్.. తక్కువ కాలంలో కీలక ఆటగాడిగా మారాడు. ప్రతి సీజన్‌లో రాణిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!