దేశవాళీ టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ’ 2024కి సమయం ఆసన్నమైంది. నవంబర్ 23 నుండి డిసెంబర్ 15 మధ్య ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. భారత్, దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచరీలతో చెలరేగిన తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే హైదరాబాద్ జట్టుకు తిలక్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.
15 మందితో పాటు మరో ఏడుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో మూడు మ్యాచ్‌ల తర్వాత జట్టును సెలక్షన్ కమిటీ సమీక్షించనుంది. విఫలమైన ఆటగాళ్లను తప్పించి.. మిగతా వారికి జట్టులో చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-ఏలో భాగంగా నవంబర్ 23న మేఘాలయతో హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టీ20 మ్యాచ్ ఉదయం 9 గంటలకు ఆరంభం కానుంది.
Also Read: IPL 2025 Auction: విరాట్ కెప్టెన్ అయితే.. అతడి కోసం కచ్చితంగా ట్రై చేస్తాడు!
హైదరాబాద్ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, సీవీ మిలింద్, టి. రవితేజ, బుద్ధి రాహుల్, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి (కీపర్), రాహుల్ రాదేశ్ (కీపర్), శరణు నిశాంత్, రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, అమన్ రావు.