ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్దపులి సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు.
Tiger Fear: పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. పులి సంచారం గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పులి సంచారం కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పిప్పల్ కోటి కాల్వ పనులు కొనసాగుతున్న ఏరియాలో పులి కనిపించింది. దీంతో ఓ వాహన డ్రైవన్ పులి ని సెల్ ఫోన్ లో వీడియో తీసి…
కాకినాడ జిల్లా వాసులకు మూడు వారాలుగా గుండెల్లో దడపుట్టిస్తోంది ఆ పెద్దపులి. తాజాగా శంఖవరం మండలం కొంతంగి ఎర్రకొండ పై పులి సంచారం కనిపించిందంటున్నారు. పులి కనిపించిందని చెప్తున్న కొండపై జీడిపిక్కల కోసం వెళ్ళారు కొందరు యువకులు. భయంతో పరుగులు తీసిన యువకులు ఈ సంగతి ఊళ్ళోకి వచ్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా ఎక్కడో చోట అలజడి కలిగిస్తూనే వుంది. దానిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. దీంతో చీకటి పడ్డాక గడప…
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని ఓ పెద్దపులి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 21 రోజులుగా ప్రజలను అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో రాత్రి ప్రత్యక్షం అయింది. దీనిని బంధించేందుకు బోన్లు, సీసీ కెమేరాలు ఏర్పాటుచేసినా ఒక్కో రోజు ఒక్కో దిశ మార్చుకుంటూ అలజడి కలిగిస్తోంది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో పెద్ద శంకర్ల పూడి ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి వైపు వస్తుండగా…
కాకినాడ జిల్లాలో పులి సంచారం జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రత్తిపాడు (మం) పోతులూరు, కొడవలి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఎంపీ వంగా గీత స్పందించారు. పులిని బంధించే వరకు రైతులు పొలాల వైపు వెళ్లొద్దని ఎంపీ సూచించారు. 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రకటించారు. పులిబారినపడి చనిపోయిన పశువుల రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ఎంపీ గీత. మరోవైపు ప్రత్తిపాడు వద్ద పులి…