SKN : ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత టికెట్ రేట్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ రేటులో రూపాయికి 17 పైసలు మాత్రమే నిర్మాతలకు వస్తున్నాయన్నాడు. మిగతా మొత్తంలో మల్టీప్లెక్సులకే అత్యధికంగా వెళ్తున్నట్టు తెలిపాడు. అసలు సినిమా టికెట్ రేటులో నిర్మాతలకు ఎంత వస్తుంది, మిగతా మొత్తం ఎవరికి వెళ్తుందో తెలియజేసేలా ఓ ఫొటోను పంచుకున్నాడు ఎస్కేఎన్. ఆయన ఫొటో…
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న నాయకుడిగా నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన వాగ్వాదాలు, వారిపై సవాళ్లు విసిరి ప్రాచుర్యంలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో జరిగిన అధికారిక కార్యక్రమంలో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వివాదం…