SKN : ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత టికెట్ రేట్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ రేటులో రూపాయికి 17 పైసలు మాత్రమే నిర్మాతలకు వస్తున్నాయన్నాడు. మిగతా మొత్తంలో మల్టీప్లెక్సులకే అత్యధికంగా వెళ్తున్నట్టు తెలిపాడు. అసలు సినిమా టికెట్ రేటులో నిర్మాతలకు ఎంత వస్తుంది, మిగతా మొత్తం ఎవరికి వెళ్తుందో తెలియజేసేలా ఓ ఫొటోను పంచుకున్నాడు ఎస్కేఎన్. ఆయన ఫొటో ప్రకారం ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే రూ.2200 ఖర్చు అవుతుందంట.
Read Also : Rajamouli : రాజమౌళి.. వివాదాంపై స్పందించొద్దని డిసైడ్ అయ్యాడా..?
ఇందులో ప్రేక్షకులు థియేటర్ లో తినే ఫుడ్, మెయింటెన్స్, ఇతర సర్వీసు ఛార్జీలు కలిపి రూ.1,545 మల్టీప్లెక్స్‌కు వెళ్తుండగా, నిర్మాతకు రూ.372 (నెట్), ప్రభుత్వ పన్ను రూ.182 (జీఎస్టీ), బుక్‌మై షోకు కన్వీనియన్స్ ఫీజు రూపంలో రూ.78 వెళ్తున్నట్లు తెలిపారు. ఒక నిర్మాత సినిమా కోసం కష్టపడి డబ్బులు పెట్టి, అందరికీ రెమ్యునరేషన్లు ఇచ్చి నష్టాలు వస్తే భరించినా సరే ఎవరూ పట్టించుకోరన్నాడు. ఒకవేళ లాభం వస్తే అందులో నిర్మాతకు వచ్చేది 17.08 శాతమే అని బుక్ మై షోకు 3.61 పర్సెంట్ వెళ్తుందన్నాడు. అందులో నిర్మాతలకు ఎలాంటి లాభం ఉండదని.. కాబట్టి నిర్మాతలు ఏదో లాభపడిపోతున్నారని చెప్పడం కరెక్ట్ కాదన్నాడు.
Read Also : GHMC : జీహెచ్ఎంసీలో కలువనున్న 27 మున్సిపాలిటీలు ఇవే..
కష్టపడి దర్శకుడుని పట్టుకొని కథ చేయించుకొని హీరో ని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఒక
ఒక ఫామిలీ మల్టీప్లెక్స్ లో
2200 ఖర్చు చేస్తే ఎంత మిగులుతుందో ఇది డిటైల్డ్ ఎనాలిసిస్ జస్ట్ 17%పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్ థియేటర్ యాడ్స్ తో నిర్మాతకి పైసా సంభంధం… pic.twitter.com/iQmD1yIsZ6
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 25, 2025