అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నంది. వేగంతో వచ్చిన స్కోడా కారు.. లారీని ఢీ కొట్టింది. దీంతో.. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణలో ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శేరిపల్లి సమీపంలో రమ్య అనే విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు.. మంచిర్యాల జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దొరగారి పల్లి గ్రామానికి చెందిన ఘటిక తేజస్విని అనే విద్యార్థిని.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో…
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు…
ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు మారేడుమిల్లి వద్ద గుడిసె విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటికి తీశారు. మృతులు ఉదయ్ కిరణ్, హేమంత్, హర్షవర్థన్ అనే విద్యార్థులుగా గుర్తించారు. పదిమంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది.
IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు.