కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెడన బైపాస్ రోడ్ లో లారీ, బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నం నుండి పెయింట్ పని ముగించుకుని తిరిగి స్వగ్రామం అత్తమూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయం పావురాలను ఎగురవేస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇష్యూలో ముగ్గురు వ్యక్తులపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ బర్డ్స్ క్రుయాల్టీ యాక్ట్ లా కింద కేసు నమోదు చేశారు. 100 కిలోమీటర్లు ప్రైజ్ మనీ.. తర్వాత 200 కిలోమీటర్ల ప్రైస్ మనీ.. తర్వాత 300 కిలోమీటర్ల ప్రైస్ మనీ ఇలా బెట్టింగులకు పాల్పడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో శుక్రవారం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. గాయపడ్డ 15 మంది కార్మికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడిశా, బీహార్, యూపీ నుంచి వచ్చిన కార్మికులు ఈ కంపెనీలో ఎక్కువగా పని చేస్తున్నారు. మృతులంతా బీహార్, ఒడిశా, యూపీ వాసులే. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. పేలుడు…
పాట్నా సమీపంలోని ఫతుహా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వర్గం వారు ఇద్దరు.. మరో వర్గానికి చెందిన ఒకరు మృతి చెందారు. రూ.400 పాల బకాయిల విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం యర్రదొడ్డి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాదలో మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీలోని బహదూర్ పురా పొలీసులు గంజాయి అమ్ముతున్న ఇద్దరీతో పాటు గంజాయి కొని, సేవించే వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.