దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్టానికి కేసులు తగ్గాయి. ఇది సంతోషించాల్సిన విషయం. ఐతే, థర్డ్ వేవ్ భయాలు మాత్రం మనల్ని వీడలేదు. మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో భయాలు కూడా ఎక్కువవుతున్నాయి. బ్రిటన్,రష్యా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారత్‌ను ఇప్పుడు థర్డ్ భయం వెంటాడుతోంది. ఇప్పటికే మన దేశంలో ప్రారంభమైందని కొందరు…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కోవిడ్ మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆక్సిజన్ సిలిండర్లను యుద్ధ విమానాల ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడంతో కోవిడ్ మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రజలంతా కోవిడ్ పై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండటంతో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కట్టడిలోకి వచ్చింది. అయితే భారత్…
దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ప్రతి రోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. అయితే, థర్డ్ వేవ్ ముప్పుపొంచి ఉందన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌ను వేగం చేయడంతో కరోనా కేసులు నమోదవుతున్నా మరణాల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. థర్డ్ వేవ్ ముప్పుపై బెనారస్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి. మూడో వేవ్ ముప్పు మరో మూడు…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఈ సమావేశం నిర్వహించారు. కాగా, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని మోడీ ఆదేశించారు.. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని సూచనలు చేశారు. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న.. మోడీ మరోసారి అధికారులను అలర్ట్ చేశారు. దేశంలో ఇంకా పూర్తిగా సెకండ్ వేవ్ కూడా ముగియలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నిన్న…
ఓ పక్క కేసులు తగ్గాయన్న సంతోషం… మరోవైపు థర్డ్ వేవ్ మొదలైందన్న ఆందోళన. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాం. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. కొత్తగా 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. అయితే ఇదే సమయంలో దేశంలో థర్డ్ వేవ్ పాదం మోపటం ఓ…
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అయ్యారు.. ఇప్పటికీ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఆయన చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అందుకే వారు చేసే…
థర్డ్ వేవ్ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ మొదటి నుంచి చాలా శాస్త్రీయ పద్దతిలో కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుందని… పిల్లల ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించింది. మళ్ళీ కొత్త రకం స్ట్రైన్, ఇంతకన్నా బలమైన వైరస్ స్ట్రైన్ వస్తే తప్ప మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. 8 నెలల తరువాత పాఠశాలల ప్రారంభం కానున్నాయని… తల్లిదండ్రుల్లో భయాలు ఉన్నాయని తెలిపింది. తక్కువగా విద్యార్థులు పాఠశాలలకు…
కరోనా ఫస్ట్ వేవ్ అయినా.. సెకండ్ వేవ్ అయినా.. మహారాష్ట్రలో సృష్టించిన విలయం మామూలుది కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది లేదు.. కానీ, ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలు గాలి కొదిలి తిరిగేస్తున్నారు.. అయితే, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. కరోనా మహమ్మారితో పోరాటం కూడా స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనని వ్యాఖ్యానించిన…
సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ సరిపోక చాలా ఇబ్బంది పడ్డామని, మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం బాధేసింది విజయవాడ వీజీహెచ్ సూపరిండెంట్ తెలిపారు. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగానే సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పుడు 1000 లీటర్ల కెపాసిటీ కల్గిన మూడు కంటైనర్లు ఏర్పాటు చేసాం.. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాము. ఆక్సిజన్ పైపుల వెడల్పు పెంచి ఒకేసారి ఎక్కువ మందికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేసామన్నారు. వెంటిలేటర్స్ దగ్గర నుండి…