ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. కేరళ, మహారాష్ట్రతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందని గతంలో నిపుణులు పేర్కొన్నారు. అయితే, థర్డ్ వేవ్ ఈ నెలలోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌ల మధ్య వచ్చిన గ్యాప్, తీవ్రత, కేసుల పెరుగుదల…
కోవిడ్ మూడోవేవ్ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది, ఎందుకంటే మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పుఅన్నట్టు కేంద్రం మాట్లాడుతున్నది.దేశంలో నమోదైన కోవిడ్ మరణాలసంఖ్యకు వాస్తవంగా సంభవించిన వాటికి చాలా తేడావున్నట్టు అంతర్జాతీయంగానూదేశంలోనూ కూడా కథనాలు వచ్చాయి. ప్రధాని మోడికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం బృందంనుంచి…
కరోనా మూడో వేవ్ సీరియస్ గా ఉండకపోవచ్చు అని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ఆగస్టు చివర్లో మూడో వేవ్ వస్తుందో, రాదో తెలిసిపోతుందన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం అసలైన సవాళ్లు అని పేర్కొన్నాడు. ప్రస్తుత జాగ్రత్తల…
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతున్నది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిబంధనలు సడలించారు. అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. Read: హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్ వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చినా,…
అమరావతి : కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 ద్వారా పిల్లలకు చికిత్స 24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్ టెలీ సేవలు తీసుకు రావాలని..అలాగే 150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలని… ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలని…