సాధారణంగా ఆస్పత్రుల్లో వీల్ చైర్లు అనేవి ఉంటాయి. పేషెంట్స్ ను తీసుకుపోవడానికి అవి ఉపయోగపడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. అక్కడ వీల్ చైర్ కనిపించలేదు. దీంతో గాయపడిన తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని మూడో ఫ్లోర్ వరకు వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది.