ఎక్కడైతే దేవుడి హుండీ చోరీ జరిగింతే.. మళ్లీ అక్కడికే దేవుడి సొమ్ము వచ్చింది. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆ హుండీలోని సొమ్మును తిరిగి యధా స్థానంలో పెట్టారు. దానితో పాటు అందులో ఓ లేఖ కూడా ఉండడం విశేషం.…