యూపీలోని హాపూర్‌లో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) యునైటెడ్ కిసాన్ మోర్చా నిరసన వ్యక్తం చేసింది. రైతులు నిరసన ప్రదర్శన చేపట్టిన తర్వాత, కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఢిల్లీ-లక్నో రహదారిని దిగ్బంధించి అక్కడే బైఠాయించారు. దిష్టిబొమ్మ విషయంలో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దిష్టిబొమ్మను లాక్కున్నారు. హాపూర్ నగర్‌లో రైతులు, పోలీసుల…