Yadadri Tharmal Plant : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్లాంట్‌లోని మొదటి యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ నుండి ఆయిల్ కారుతుండగా, దాని కింద వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో యూనిట్ ట్రయల్ రన్ కోసం సిద్ధమవుతోంది. అదృష్టవశాత్తు, ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే…