భారతీయ మూలాలున్న హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తనదైన బాణీ పలికించారు. ఆయన కూతురు ఇషానా నైట్ శ్యామలన్ తండ్రి అడుగుజాడల్లోనే మెగాఫోన్ పట్టి ‘ద వాచర్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇంతకుముందు తండ్రి రూపొందించిన “ఓల్డ్, నాక్ ఎట్ ద క్యాబిన్” సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇషానా ‘ద వాచర్స్’తో తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇందులో డకోటా ఫ్యానింగ్ ప్రధాన పాత్ర పోషించడం ఇప్పుడు విశేషంగా మారింది. తండ్రి సినిమాల్లోని…