మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్…