Skydiver: సాహసం చేయాలనే ప్రయత్నం విషాదాన్ని నింపింది. డేర్ డెవిల్‌గా పిలువబడే నాతీ ఓడిన్సన్ అనే స్కైడైవర్ 29వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. బ్రిటన్‌కి చెందిన 33 ఏళ్ల ఓడిన్సన్ థాయ్‌లాండ్ లోని పట్టాయాలో భవనం నుంచి స్కై డైవింగ్ చేయాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే పారచూట్, హెల్మెట్ సిద్ధమైన తర్వాత ఈ ఫీట్‌ని అతని స్నేహితుడు కింద నుంచి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు.
Ayutthaya: హైందవం ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పడు ఇస్లామిక్ దేశాలుగా చెప్పబడుతున్న పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియాతో పాటు మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా హిందూ మతానికి చెందిన ఆనవాళ్లు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇండోనేషియాలో ఇస్లాం మతస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలా మంది హిందూ ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు. ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ పేరు ‘గరుడ’ అని పెట్టుకున్నారంటే, వారు ఎంతగా ఈ హిందూ జీవనశైలితో మమేకమయ్యారో తెలుసుకోవచ్చు.
సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు.
Bat Virus: గబ్బిలాల్లో ప్రాణాంతక వైరస్‌ని పరిశోధనా బృందం థాయ్‌లాండ్‌లో కనుగొంది. గతంలో కరోనా వైరస్‌తో ముడిపడి ఉన్న ఎకోహెల్త్ అలయన్స్ పరిశోధకులే ఈ డెడ్లీ బ్యాట్ వైరస్‌ని కనుగొన్నారు. ఈ సంస్థ చీఫ్ డాక్టర్ పీటర్ దస్జాక్ కోవిడ్ లాగే మానవులకు సోకే అవకాశం ఉన్న వైరస్‌ని కనుగొన్నట్లు డైలీ మెయిల్ నివేదించింది. గతంలో ఈ పరిశోధర బృందానికి చైనా వూహాన్ వివాదాస్పద ప్రయోగశాలతో సంబంధం ఉంది. థాయ్‌లాండ్ లోని ఓ గుహలోని గబ్బిలాల్లో ఈ…
భారతీయులకు మలేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారతీయులు ఇప్పటికే థాయ్‌లాండ్, శ్రీలంకలో వీసా ఫ్రీ ఎంట్రీని పొందుతున్నారు. ఇక నుంచి మలేషియాలో వెళ్లేందుకు వీసా అవసరం లేదని ఆ దేశ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటన చేశారు.
Hamas: గాజాలో హమాస్ బందీలపై థాయ్‌లాండ్ రాజకీయ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తుల సంధి కుదిరితే, విడుదలయ్యే బందీల్లో థాయ్ దేశానికి చెందిన వారంతా ఉంటారని, ఇలా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ తమకు హమీ ఇచ్చిందని థాయ్-ముస్లిం రాజకీయ నేతలు గురువారం తెలిపారు. ఏదైనా కాల్పుల విరమణ జరిగితే 3-5 రోజుల్లో బందీలను విడుదల చేస్తుందని, అందులో థాయ్ ప్రజలు ఉంటారని థాయ్-ఇరాన్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లెపాంగ్ సయ్యద్ బ్యాంకాక్ పార్లమెంట్ భవనంలో…
ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఓ లగ్జరీ మాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనలో 14 ఏళ్ల అనుమానిత సాయుధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చైనా నుంచి వచ్చే ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కొత్త వీసా రహిత ప్రవేశ కార్యక్రమం కింద సోమవారం బ్యాంకాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది చైనీస్ పర్యాటకులకు థాయ్‌లాండ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.