Israeli flight: ఇజ్రాయిల్‌కి వెళ్తున్న ఓ విమానాన్ని దారి మళ్లించి హైజాక్ చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై దాడి జరిగింది. దుండగులు విమానాన్ని దారి మళ్లించేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. హౌతీలు యాక్టివ్‌గా ఉన్న ఏరియాలో ఈ ఘటన జరిగింది. థాయ్‌లాండ్ ఫుకెట్ నుంచి ఇజ్రాయిల్ బెన్-గురియన్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం కమ్యూనికేషన్ నెట్వర్క్ దాడికి గురైనట్లు ఇజ్రాయిల్ మీడియా ఆదివారం నివేదించింది. దాడి చేసిన వ్యక్తుల విమాన సిగ్నలింగ్ వ్యవస్థను స్వాధీనం చేసుకుని దాని గమ్యాన్ని మార్చేందుకు యత్నించారు.
Read Also: Pakistan: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. నేడు ఇరుపక్షాలు నాలుగో విడత భేటీ
అయితే, ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం గమ్యస్థానానికి చేరుకుందని ఇజ్రాయిల్ మీడియా తెలిపింది. దాని వెనక శత్రువులు ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనను ఇప్పటి వరకు ఇజ్రాయిల్ అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగబాటుదారులు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటన జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. అనుమానాస్పద ఆదేశాలతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, వారి ఆదేశాలను పాటించలేదు. గత వారం ఇలాగే బ్యాంకాక్ వెళ్తున్న విమానాన్ని కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు.