Burra Venkatesham: గ్రూప్ -2 అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. గ్రూప్ 2కు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు.