Burra Venkatesham : “నేనున్నా.. ధైర్యంగా పరీక్షలు రాయండి” నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ హామీ
- అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం నా బాధ్యత
- ఇక మీద పరీక్ష వాయిదాలు ఉండవు
- Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తాం
- టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. వాయిదాలు ఉండవని.. అలాంటి ఆలోచనలు ఉంటే తొలగించుకోండన్నారు. డీఎస్సీ ఫలితాలు 60 రోజుల్లో ఇవ్వగలిగినట్లు తెలిపారు. Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే మూడున్నర ఏళ్ల సర్వీస్ ను వదులుకొని వచ్చినట్లు తెలిపారు. యూపీఎస్సీ తో సమానంగా tgpsc పని చేస్తుందని కొనియాడారు.
READ MORE: Delhi: ఉబర్‌కు కోర్టు షాక్.. టైమ్‌కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తన మీద నమ్మకం తో పరీక్షలు రాయాలని.. ఎవరైనా పైరవీ చేస్తా నంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పబ్లిక్ కు అందుబాటులో ఒక ఫోన్ నంబర్ పెడతామని చెప్పారు.
Tgpsc ఛైర్మన్ కు ఉన్నా విస్తృత అధికారాలను వినియోగించుకొని న్యాయం చేస్తామని వివరించారు. తెలంగాణ గెలిచి నిలవాలన్నారు.. ఐఏఎస్ కావాలని తన కల సాకారం అయిందని.. రాజీనామా చేసి ఇప్పుడు నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.
READ MORE: Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
కాగా.. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 3తో మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!