Tummala Nageswara Rao :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్‌లో సమావేశమై పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు.…
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే, ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది.
Sircilla Textile Industry: సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడింది. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Sri Lankan crisis- women into prostitution: శ్రీలంకలో రాజకీయ అధికారం మారినా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనం అయిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం పెద్దపెద్ద క్యూల్లో నిలబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయములో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. జిల్లాలో కరోన థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు చేశాం అన్నారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించాము. వాక్సినేషన్లో రాష్ట్రములోనే జిల్లా ఐదవ స్థానములో ఉంది. జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాభై వేల ఇండ్లు ఫీవర్ సర్వే చేస్తున్నాయన్నారు.…